విధుల కేటాయింపులో తనకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో.. చిత్తూరు జిల్లా పీలేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పీలేరు ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్ రమణ.. కొంతకాలంగా తనకు కేటాయిస్తున్న డ్యూటీల పట్ల అసంతృప్తితో ఉన్నాడు. ఉన్నతాధికారుల్లో కొంతమంది కావాలనే తనపై కక్ష సాధిస్తున్నారు అంటూ ఆవేదన చెందిన డ్రైవర్.. పీలేరు ఆర్టీసీ డిపోలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన డ్రైవర్ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...