Additional DG Kripananada: ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిని రోడ్ అండ్ సేఫ్టీ అడిషనల్ డీజీ కృపానంద త్రిపాటి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోయ ప్రాంతంలోకి దిగి ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఒకే చోట ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఆర్ అండ్ బి అధికారులు స్పందించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా... తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన అధికారులతో చర్చించారు.
నివారణ చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. జాతీయ రహదారులపై ఉన్న దాబాలను, హోటళ్లను అప్పుడప్పుడూ తనిఖీలు చేసి, వారు మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. సకాలంలో స్పందించి క్షతగాత్రులను కాపాడిన పోలీసు, అటవీశాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, త్వరితగతిన ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది.
ఇదీ చదవండి: పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు