ETV Bharat / state

నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి - road accidents news latest

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accidents in krishna, srikakulam, chittoor, nellore districts

author img

By

Published : May 29, 2020, 11:13 AM IST

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న.. నూజివీడుకు చెందిన మల్లిశెట్టి విజయలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

శ్రీకాకుళంలో

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస వద్ద ట్రావెల్‌ బస్సును... వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్‌ మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

చిత్తూరులో

చిత్తూరు జిల్లా కుప్పం బైపాస్ మార్గంలోని కమతమూరు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్​ పరారీలో ఉన్నాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరులో

నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో జాతీయ రహదారిపై లారీకి మరమ్మతులు చేస్తుండగా.. వెనుక నుంచి బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి లారీ టైర్ కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

ఐదేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారయత్నం

యువతిది ఆత్మహత్యా..? పరువు హత్యా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.