ETV Bharat / state

కాణిపాకం వినాయకుని పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు - chittor district news

భక్తుల కోరిన కోర్కెల తీర్చే... భక్తుల కొంగు బంగారమైన బొజ్జగణపయ్య ఉత్సవాలు కాణిపాకంలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు.

kanipakam
కాణిపాకంలో వినాయకుని బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Aug 22, 2020, 10:53 AM IST

Updated : Aug 22, 2020, 12:19 PM IST

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా తోరణాలతో ముస్తాబైంది. స్వామి వారి కళ్యాణ మండపాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. కరోనా కారణంగా భక్తుల తాకిడి చాలా తక్కువగా కనిపిస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుటుంబసమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాడ వీధుల్లో ఈవో కార్యాలయం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు.

రూ.10కోట్లతో ఆలయ అభివృద్ధి: మంత్రి వెల్లంపల్లి

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. కరోనా నుంచి ప్రజలను బయటపడేయాలని స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కాణిపాకం ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో బృహత్‌ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రతిచోటా దేవాలయ భూములు కాపాడుతున్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని...రఘురామకృష్ణరాజు కాణిపాకం స్వామిని దర్శించుకుంటే మంచిదని మంత్రి అన్నారు.

ఇవీ చదవండి: గణపతిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారు?

Last Updated : Aug 22, 2020, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.