చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలో 24 ఎర్రచందన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు... యర్రావారిపాలెం వద్ద తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో యలమంద క్రాస్ వద్ద... ఉదయం 3 గంటల ప్రాంతంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్రచందన దుంగలను పోలీసులు గుర్తించారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా అరెస్టు... భారీగా దుంగలు స్వాధీనం