ETV Bharat / state

ఎర్రచందనం కూలీల కొత్త ఎత్తులు... చిత్తు చేసిన పోలీసులు - red sandal wood smuggling news

పోలీసుల కళ్లు గప్పి అడవిలోకి ప్రవేశించేందుకు ఎర్రచందనం కూలీలు నూతన పంథాను ఎంచుకున్నారు. అయితే వారిని వెంటాడి అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. నిందితులంతా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు.

Red Sandal workers from TamilNadu arrested

author img

By

Published : Jan 28, 2021, 10:50 PM IST

ఎర్రచందనం కూలీల కొత్త ఎత్తులు... చిత్తు చేసిన చిత్తూరు పోలీసులు

తమిళనాడు నుంచి రాష్ట్రానికి భారీగా తరలివచ్చిన ఎర్రచందనం కూలీలను ప్రత్యేక కార్యదళం అధికారులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి-చిత్తూరు జాతీయరహదారిపై రెక్కీ నిర్వహించిన పోలీసులు.. చంద్రగిరి మండలం మరువపల్లె వద్ద అటవీ ప్రాంతంలోనికి ప్రవేశిస్తున్న స్మగర్లను గమనించి వెంటాడారు. 20 నుంచి 25 మంది స్మగర్లు అడవిలోకి పారిపోగా... మరో 17మందిని ప్రత్యేక కార్యదళం అరెస్ట్ చేసింది. వారు ప్రయాణించిన లారీతో పాటు నిత్యావసర సామగ్రి, స్వల్ప మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

లారీలో ప్రత్యేక ఏర్పాట్లు..

పోలీసుల కంటబడకుండా ఉండేందుకు ఎరువుల లోడు లారీలో ఎర్రచందనం కూలీలు ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రత్యేక కార్యదళం డీఎస్పీ వెంకటయ్య వెల్లడించారు. నిందితులను రిమాండ్​కి తరలిస్తున్నట్లు తెలిపారు. వీరంతా తమిళనాడులోని తిరుపత్తూరు, వేలూరు, తిరువణ్ణామలై ప్రాంతాలకు చెందిన పాత నేరస్థులుగా గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

కొన ఊపిరితో కొట్టుకుంటుంటే ఏటీఎం పిన్ అడిగాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.