ETV Bharat / state

రూ.కోటి విలువైన ఎర్ర చందనం పట్టివేత.. 11 మంది అరెస్టు

రూ. కోటి విలువైన 71 ఎర్ర చందనం దుంగలను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు తప్పించుకుని పారిపోయినట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

ఎర్ర చందనం పట్టివేత
ఎర్ర చందనం పట్టివేత
author img

By

Published : May 27, 2022, 12:28 AM IST

అంతర్రాష్ట్ర ఎర్ర చందనం అక్రమ రవాణా ముఠాను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల విలువైన 71 ఎర్ర చందనం దుంగలు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం చిత్తూరు-వేలూరు రోడ్డులో మాపాక్షి మలుపు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు.. అంబులెన్స్‌లో ఎర్రచందాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 8 మంది ఎర్రచందనం కూలీలు, ఇద్దరు మేస్త్రీలు, ఒక డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు తప్పించుకొని పారిపోయినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.

నిందితులందరూ పాతనేరస్థులేనన్న పోలీసులు... ఎర్రచందనం అక్రమ రవాణా చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే చిత్తూరు గ్రామీణ మండలం గుడిపాల క్రాస్ వద్ద ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 50 లక్షలు విలువ చేసే 35 ఎర్ర చందనం దుంగలు, 10 లక్షల విలువైన రెండు వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.