ETV Bharat / state

Rape on Blind Woman: అంధ యువతిపై అత్యాచారం.. వివాహితుడిపై కేసు నమోదు - ap latest news

Rape on blind women: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చిత్తూరు నగరంలో దారుణం జరిగింది. అంధ యువతిపై ఓ వివాహితుడు అత్యాచారనికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి తల్లి దిశ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

Rape on blind women at chittor
అంధ యువతిపై అత్యాచారం
author img

By

Published : Mar 9, 2022, 10:07 AM IST

Rape on blind women: అంధ యువతిపై ఓ వివాహితుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న కొండమిట్టలో బాధిత అంధ యువతి కుటుంబం నివాసం ఉంటోంది. యువతి తండ్రి చాలాకాలం కిందట మృతి చెందాడు. బాధిత యువతి నివాసం సమీపంలోనే ఉంటున్న.. ఓ రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు జయచంద్రా రెడ్డి అలియాస్ చిన్నా.. కేబుల్ ఆపరేటర్​గా పని చేస్తున్నాడు.

అదే ప్రాంతానికి చెందిన ఓ అంధ యువతికి మాయ మాటలు చెప్పి.. చిన్నా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై.. బాధితురాలి తల్లి దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ సీఐ మురళీమోహన్ తెలిపారు. నిందితుడి తండ్రి పోలీసు శాఖకు చెందినవారు కావడంతో.. కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని బాధితురాలి తల్లి అన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Suicide: యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడం వల్లేనంటూ బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.