చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వృద్ధురాలు మృతి చెందగా, డ్రైవర్ ఆటోలో ఇరుక్కు పోయాడు. పెనుమూరు మండలం, అగ్రహారంకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసుల రెడ్డి తన పెద్దమ్మ మునిలక్ష్మమ్మతో కలసి కొబ్బరి బొండాలతో తిరుపతికి ఆటోలో బయలుదేరారు. తెల్లవారుజామున తొండవాడ వద్దకు చేరుకోగానే ముందున్న వాహానాన్ని ఢీకొట్టింది. మునిలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసుల రెడ్డి ఆటోలో ఇరుక్కున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో ఇరుక్కున్న డ్రైవర్ శ్రీనివాసులను బయటకు తీసి 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి