ETV Bharat / state

గడపగడపలో ఉపముఖ్యమంత్రికి నిరసన సెగ.. మరోవైపు మా నమ్మకం నువ్వే జగనన్న

Gadapagadapaku Mana prabhutvam programme: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రికి ప్రజల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది.. చిత్తూరు జిల్లాలో పర్యటించగా.. మహిళలు, యువత సమస్యల గురించి నిలదీసారు.

Gadapagadapaku Mana prabhutvam programme

author img

By

Published : Apr 5, 2023, 8:02 PM IST

గడపగడపలో ఉపముఖ్యమంత్రికి నిరసన సెగ.. మరోవైపు మా నమ్మకం నువ్వే జగనన్న

Gadapagadapaku Mana prabhutvam programme: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది. అడగడుగునా యువత నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. సొంత మండలంలోనే తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండల కేంద్రంలోని బీసీ కాలనీ.. పెద్ద హరిజనవాడల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారులు.. ఇతర నేతలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటింటి పర్యటన చేశారు. బీసీ కాలనీలో నిరుద్యోగ యువకుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించడంతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సదరు యువకుడికి నమస్కరించి ముందుకు వెళ్లారు.

సమస్యల గురించి అడిగితే జవాబు చెప్పకుండా వెళ్లిపోతారా అంటూ నిలదీశారు. ఆ తర్వాత పెద్దహరిజన వాడలో మహిళ ప్రశ్నించిన తీరుతో ఉపముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో అసహనానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అధికారంలోకి వస్తే గడపలోకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పిన వాగ్ధానం ఏమైంది అంటూ ప్రశ్నించడంతో ఆమెకు గతంలో తాను సహకారం అందించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముందుకు వెళ్లారు. తాజాగా మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు మంత్రి నారాయణస్వామిని సమస్యల పరిష్కారం కోసం నిలదీశారు.

మా నమ్మకం నువ్వే జగనన్న.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని.. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి సంబంధించి కోడుమూరు నియోజకవర్గం వైకాపా కార్యాలయంలో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సంక్షేమ పథకాలు అన్ని వారి పేరుమీదే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత 70 సంవత్సరాల పాలనలకు భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఎన్నికలకు ముందు చెప్పిన అన్ని హామీలను నెరవేర్చిన ఘనత కూడా ముఖ్యమంత్రికే చెల్లుతుందని ఆయన తెలిపారు. తమ పరిపాలన నచ్చితేనే ఎన్నికల్లో ఓటు వెయ్యాలని అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సుధాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ ప్రభుత్వానికే అధిక ఓట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రెండవ ప్రాధాన్యతో గెలిచిందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఒంటరిగానే పోటీ చేసి గెలుపొందుతామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.