చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరం పోలింగ్ కేంద్రంలో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటర్లను పోలింగ్ బూతుల్లోకి అనుమతించకుండా.. అడ్డుకుంటున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో అరగంట వరకు పోలింగ్ ఆగిపోయింది. పోలీసులు కలుగచేసుకుని.. ఇరువర్గాల వారికి సర్ది చెప్పిన అనంతరం పోలింగ్ ప్రారంభించారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక.. ఓటు వేసిన వైకాపా అభ్యర్థి గురుమూర్తి దంపతులు