ETV Bharat / state

Municipal Elections: కుప్పం పురపాలకలో హై'డ్రామా'..అధికార, ప్రతిపక్షాల రాజకీయ రగడ - political drama in kuppam municipal elections

స్థానిక సంస్థల ఎన్నికలతో చిత్తూరు జిల్లా కుప్పం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా..ఇక్కడ పాగా వేసేందుకు అధికారపక్షం వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉండగా..నామినేషన్ల చివరి రోజు తెదేపా అభ్యర్థిపై వైకాపా నేతల దాడి, ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ, 14వ వార్డు అభ్యర్థి ప్రకాశ్ కిడ్నాప్ వార్తలు ఉద్రిక్తతకు దారితీసేలా చేశాయి. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కుప్పంలో ఎన్నడూ లేనివిధంగా హై'డ్రామా'లు నడుస్తున్నాయి. ఆసక్తికరంగా సాగుతున్న కుప్పం పురపోరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

కుప్పం పురపాలికలో హై'డ్రామా'
కుప్పం పురపాలికలో హై'డ్రామా'
author img

By

Published : Nov 8, 2021, 5:26 PM IST

Updated : Nov 8, 2021, 7:06 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్‌ల చివరి రోజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెళ్తున్న వారిపై దాడి చేసి పత్రాలను చించేసిన ఘటన మొదలు.. బరిలో ఉన్న అభ్యర్థిని కిడ్నాప్‌ చేశారంటూ అదే పార్టీ నేతలపై ఫిర్యాదు చేయడం వరకు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా...ఇక్కడ పాగా వేసేందుకు అధికారపక్షం శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కుప్పంలోనే మకాం వేసి ఎన్నికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తెదేపా అభ్యర్థిపై దాడితో మెుదలు..

నామినేషన్ల చివరి రోజు...కుప్పం 14వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఎంపీపీ వెంకటేశ్​పై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. సమాచారం అందుకున్న మాజీమంత్రి అమర్​నాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని గాయపడ్డ వెంకటేశ్​ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు..వైకాపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని..,రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలన్నారు. దాడిచేసిన వారిపై చర్యలకు ఆదేశించి..,తెదేపా అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌ వేసేలా చూడాలని చంద్రబాబు కోరారు.

నామినేషన్ తిరస్కరణ..

14 వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. కావాలనే తన నామినేషన్‌ తిరస్కరించారని అభ్యర్థి వెంకటేష్‌ ఆరోపించారు. శనివారం రాత్రి 8 గంటలకు నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు తనకు చెప్పినట్లు వెంకటేశ్ వెల్లడించారు. పత్రాలు సక్రమంగానే ఉన్నాయని ఉదయం చెప్పి..ఇప్పుడు నామినేషన్‌ తిరస్కరించినట్లు వాపోయారు.

ఆర్వో మార్పుపై హైకోర్టులో వ్యాజ్యం..

కుప్పం ఎన్నికల నిర్వహణకు మరో ఆర్వోను నియమించేలా..ఎస్​ఈసీని ఆదేశించాలని కోరతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్​గా పనిచేస్తున్న లోకేశ్వర వర్మను రాజకీయ ఒత్తిడితోనే ప్రత్యేక అధికారిగా నియమించారన్నారు. ఆయనపై పలు ఆరోపణలున్నాయని..,ఆయన ఆర్వోగా కొనసాగితే ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆర్వో లోకేశ్వర వర్మను తొలగించాలని చంద్రబాబు కూడా ఎస్​ఈసీని కోరారు. లోకేశ్వర వర్మ వైకాపా అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కిడ్నాప్ డ్రామా...

14వ వార్డు బరిలో ఉన్న మరో తెదేపా అభ్యర్థి ప్రకాశ్‌ను ఆ పార్టీ నేతలే కిడ్నాప్‌ చేశారంటూ ఆయన సోదరుడు ఫిర్యాదు చేయడం.. తానేమీ అపహరణకు గురికాలేదని ఆ తర్వాత ప్రకాశ్‌ ప్రకటించడం ఎన్నికల వేడిని మరింత రాజేశాయి. ఆదివారం ప్రకాశ్‌ అన్న గోవిందరాజు..తన తమ్ముడు ప్రకాశ్​తోపాటు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే..తాము కిడ్నాప్‌నకు గురికాలేదంటూ ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేయటంతో అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాము వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లామని..,రెండ్రోజుల్లో కుప్పం వచ్చి తమ ప్రచారాన్ని ప్రారంభిస్తామని ప్రకాశ్, ఆయన భార్య వీడియోలో వివరించారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వైకాపా రాజకీయ ఎత్తుగడలో భాగమని తెదేపా నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థులను తామే కిడ్నాప్‌ చేశామంటూ ఫిర్యాదు చేస్తూ సరికొత్త ఆటకు తెరతీశారని ఆక్షేపించారు.

వ్యూహ, ప్రతివ్యూహాలు..

ఇదిలా ఉండగా..ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మూడ్రోజులు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు...పాదయాత్రలు, రోడ్ షోలు, సమావేశాలతో శ్రేణుల్లో జోష్‌ నింపారు. పురపాలక సంఘం పరిధిలోని గ్రామాలతో పాటు పట్టణంలోని కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. తొలిసారి జరుగుతున్న కుప్పం పురపాలికపై తెలుగుదేశం జెండా ఎగురవేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలు...తమకు పట్టం కడతారని తెలుగుదేశం నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

పాగా వేయాలని...

కుప్పం పురపాలక ఎన్నికను అధికారపక్షం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలుపొంది.. రాజకీయంగా ఆయన్ను మరింత ఇబ్బందికి గురిచేసేలా పావులు కదుపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన వైకాపా నేతలు ప్రత్యక్షంగా ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా శాసనసభ్యులు కుప్పం పట్టణంలో తరచూ పర్యటిస్తూ వైకాపా తరపున ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపునకు దోహదపడతాయని వైకాపా నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.

కుప్పం పురపాలకలో మెుత్తం 25 వార్డులు ఉండగా..ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స్థానికంగా నేతలు మకాం వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఇదీ చదవండి

రసవత్తరంగా.. కుప్పం పురపాలక ఎన్నికలు

Last Updated : Nov 8, 2021, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.