చిత్తూరు జిల్లా పుత్తూరు అటవీ శాఖ పరిధిలోని మొగల్తూరు బీట్ పరిధిలోని కందకంలో 21 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. రహస్యంగా అందిన సమాచారంతో రాత్రి దాడులు చేశామని ఎస్డీఎఫ్ శ్రీనివాసరావు తెలియజేశారు.
దుంగలు 255 కేజీలు ఉన్నాయన్నారు. వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 19.75 లక్షలు అని తెలిపారు. నిందితులు తప్పించుకున్నారని వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని ... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: