చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం తలకోన అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కుంబింగ్ నిర్వహించారు. దేవరకొండ అటవీప్రాంతంలో కనితలకొండ వద్ద తమిళ స్మగ్లర్స్ అధికారులకు తారసపడ్డారు. వారివద్దనుంచి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు తమిళ స్మగ్లర్స్ని గుర్తించారు. రామకృష్ణ, వెల్లు ముత్తుకుప్ప స్వామి, సౌందర్ రాజన్, అప్ప స్వామికన్ను అదుపులోకి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. వారిని రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి. కళింగపట్నంలో కనువిందు చేస్తోన్న పవన్ సైకిత శిల్పం