చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ రోజురోజూకి పెరుగుతోంది. యర్రవారిపాలెం మండలం తలకోన అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు మర్రిమానుదడి వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించిన తమిళ స్మగ్లర్లు... దుంగలను పడేసి దట్టమైన ఆటవీ ప్రాంతంలోకి పారిపోయారు. 34 ఎర్రచందనం దుంగలను నలుగురు తమిళ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదీచూడండి.చిన్నారి కిడ్నాప్ కేసు.. పట్టించింది నాన్న ఫోన్ నంబరు!