ETV Bharat / state

తోవ లేక వచ్చి.. 'నీవా'లో చిక్కి!

పొలానికి వెళ్లేందుకు నదిని దాటుతూ..వరదలో చిక్కుకున్న రైతును పోలీసులు కాపాడారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో జరిగింది.

Police rescue a farmer trapped in a flood while crossing a river to go to a farm.
వరదలో చిక్కుకున్న రైతును కాపాడిన పోలీసులు
author img

By

Published : Nov 29, 2020, 10:38 AM IST

పొలానికి వెళ్లేందుకు నదిని దాటుతూ వరదలో చిక్కుకున్న రైతును పోలీసులు కాపాడారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కలిజవేడుకు చెందిన రైతు అబ్బులయ్య(61) కొట్రకోనలోని పొలానికి వెళ్లేందుకు శనివారం నీవా నది గుండా బయల్దేరాడు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో నది మధ్యలోని బండరాయిపై కూర్చొని సహాయం కోసం అరిచాడు. వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎగువన ఎన్టీఆర్‌ జలాశయం గేట్లు మూసివేయించారు. చిత్తూరు నుంచి ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం వచ్చి అబ్బులయ్యను రక్షించి బయటకు తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

ఇంకా ముంపు నీటిలోనే పంట చేలు..గుండె చెరువైన అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.