చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్ద తిప్ప సముద్రం మండలం.. ఒడ్డిపల్లె గ్రామం వద్ద పేకాట శిబిరంపై పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సాధారణ దుస్తుల్లో అక్కడికి చేరుకున్నారు.
పోలీసులను గుర్తుపట్టని పేకాట రాయుళ్లు పారిపోకుండా అక్కడే కూర్చుని, కొత్త ఆటగాళ్ళు వచ్చారని ఆహ్వనించారు. పోలీసులు పేకాట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 6,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:
ఇంద్రకీలాద్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టిస్తారా?: పవన్