చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఉపాధ్యాయురాలిని కిడ్నాప్ చేస్తూ.. ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. మండలములోని ఓ ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యయురాలిని అపహరించి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. అడ్డొచ్చిన ఆమె తండ్రిపై దాడి చేశాడు. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్తున్నారని ఉపాధ్యాయురాలి తండ్రి పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించి సినీఫక్కీలో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుడైన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయురాలి కిడ్నాప్‌కు యత్నం: నిందితుడు అరెస్ట్ - చిత్తూరు తాజా న్యూస్
ఉపాధ్యాయురాలిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జరిగింది.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఉపాధ్యాయురాలిని కిడ్నాప్ చేస్తూ.. ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. మండలములోని ఓ ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యయురాలిని అపహరించి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. అడ్డొచ్చిన ఆమె తండ్రిపై దాడి చేశాడు. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్తున్నారని ఉపాధ్యాయురాలి తండ్రి పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించి సినీఫక్కీలో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుడైన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
'నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాలి'