చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు నాలుగు నెలల క్రితం అదృశ్యమయ్యారు. ఈ కేసును తంబళ్లపల్లి పోలీసులు ఛేదించారు.
అసలేం జరిగిందంటే..
గంగిరెడ్డిపల్లి గ్రామానికి సరళ, గంగులమ్మ అనే ఇద్దరు మహిళలు నాలుగు నెలల క్రితం అదృశ్యమయ్యారు. మహిళల కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తాజాగా రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మౌలాలిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బయటకు వచ్చింది. ఇద్దరు మహిళలను హతమార్చినట్లు ఒప్పుకున్న నిందితుడు.. మృతదేహాలను పెద్దేరు ప్రాజెక్టు జలాశయం సమీపంలో పూడ్చి పెట్టిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు. మృతదేహాల దుస్తులు, అవశేషాల ఆధారంగా వారిని గుర్తించారు. విచారణ అనంతరం మదనపల్లి డీఎస్పీ శుక్రవారం వివరాలను వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: అచ్యుతానంద స్వామికి నివాళులర్పించిన కాకినాడ, భీమిలి పీఠాధిపతులు