చిత్తూరు జిల్లా తమిళనాడు- ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలైన నగిరి, పుత్తూరులో నాటుసారా ఏరులై పారుతుంది. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు నగిరి అర్బన్ ప్రాంతంలో, అడవికొత్తూరు గ్రామ పొలిమేరల దాడులు చేసిన పోలీసులకు 560 లీటర్ల నాటుసారా పట్టుబడింది. సారాతయారికి ఉపయోగించే బెల్లం, తుమ్మచెక్క, 9000 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఇద్దరు తయారీదారులను అరెస్ట్ చేశారు. ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే స్థానికులు తమదృష్టికి తేవాలని పోలీసులు ప్రజలను కోరారు. నగిరి సీఐ మద్దయ్య ఆచారి... వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది చదవండి లాక్ డౌన్ ఎఫెక్ట్: చిత్తైన తుక్కు వ్యాపారం