సీఎం జగన్ సంక్షేమ పథకాలు, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే తార్కాణమని.. నగరి శాసన సభ్యురాలు ఆర్కే. రోజా పేర్కొన్నారు. పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పుత్తూరు, నగరి పురపాలక సంఘాల కౌంటింగ్ కేంద్రాలకు వచ్చిన ఆమె.. వైకాపా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించారన్న రోజా.. రాబోయే రోజుల్లోనూ ప్రజల చెంతకే పరిపాలన తీసుకువెళుతూ.. సేవను కొనసాగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎగిరిన వైకాపా జెండా