చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కీలపట్టు సచివాలయం వద్ద ఉద్రిక్తతను పోలీసులు చక్కదిద్దారు. పది రోజుల క్రితం చెన్నై కోయంబేడు మార్కెట్ కాంటాక్ట్ కారణంగా.. కీలపట్టులో ఓ వ్యక్తికి కరోనా సోకింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల కింద కొంతమంది గ్రామస్థులను అధికారులు క్వారంటైన్ కు తరలించారు.
తప్పుడు సమాచారంతో తమ వాళ్ళను క్వారంటైన్ కి తరలించారంటూ సచివాలయం వద్ద అధికారులను గ్రామస్తులు నిలదీశారు. రోగి చెప్పిన వివరాల మేరకే క్వారంటైన్ చేశామని సచివాలయం సిబ్బంది చెబుతున్నా.. కుటుంబ పెద్దలను క్వారంటైన్ చేసిన కారణంగా తామంతా ఉపాధి కోల్పోయామని గ్రామస్థుల నిరసన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.
ఇదీ చూడండి: