రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఆరికట్టాలని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. న్యాయమూర్తి రామకృష్ణను పరామర్శించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల ప్రజలపై దాడులు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలపై దాడులు సర్వసాధారణయ్యాయని ఆరోపించారు. న్యాయమూర్తి రామకృష్ణకే ఇబ్బందులు తప్పడం లేదని... ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎస్సీలపై దాడులు, శిరోముండనం వంటి ఘటనలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి