నివర్ తుపాను కారణంగా పంటలు కోల్పోయిన రైతాంగాన్ని పరామర్శించి.. వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. నిన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన పవన్.. నేటి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి రెండ్రోజుల పాటు పవన్ పర్యటించనున్నారు. జిల్లాలో పంట నష్టంపై జనసేన నాయకులతో చర్చిస్తారు. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి కరకంబాడీ మీదుగా తిరుపతికి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. జనసేన నేతలతో తిరుపతి ఉపఎన్నికల పైనా చర్చించే అవకాశం ఉంది.
రేపు శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని పవన్ కల్యాణ్ కలవనున్నారు. అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరు మీదుగా నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఇదీ చదవండి: 'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేలు ఇవ్వండి'