కలియుగ వైకుంఠం తిరుమలలో నేటి నుంచి పద్మావతి శ్రీనివాసుల పరియణోత్సవాలు జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని మండపంలో వేడుక నిర్వహించనున్నారు. పరిణయోత్సవ మండపాన్ని సుందరంగా అలంకరించారు. పరిణయోత్సవాల్లో భాగంగా సాయంత్రం గజవాహన సేవ నిర్వహించనున్నారు. మంగళవారం అశ్వవాహనంపై, బుధవారం గరుడవాహనంపై మలయప్పస్వామి విహరించనున్నారు. పరిణయోత్సవాల కారణంగా మూడ్రోజులపాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
పెరిగిన భక్తుల రద్దీ
పరిణయోత్సవాల సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. నిన్న ఆదివారం ఒక్కరేజే శ్రీవారిని లక్షా 1 వేయి 86 మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 85 లక్షలుగా నమోదైంది.