చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీపద్మావతి అతిథి గృహంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అధ్యక్షతన వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ధి శాఖలు, రాయలసీమ పరిధిలోని నీటిపారుదల శాఖల అధికారులతో మాట్లాడారు. మధ్యాహ్నం మూడు గంటలకు కొవిడ్ నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. కమిటీ సభ్యులు సంజీవయ్య, ఎం. నాగార్జున, భూమన కరుణాకరరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Curfew Relaxation: 50 శాతంతో వాటికి అనుమతి..అవి ఏంటంటే..!