తిరుపతి స్విమ్స్‌కి ఆక్సిజన్ కొరత తీర్చేలా చిత్తూరు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాష్ట్రం ఆక్సిజన్ సరఫరాలో కోతవిధించటంతో... కర్ణాటకలోని కోలార్ జిల్లా ఎయిర్ వాటర్ ఫ్యాక్టరీ నుంచి 16 టన్నుల ఆక్సిజన్‌ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటపఅప్పల నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ వాహనానికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. చెక్‌పోస్ట్‌ల వద్ద ముందస్తుగా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బారికేడ్లను తొలగించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనాన్ని నేరుగా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆక్సిజన్ అందటంతో స్విమ్స్‌లో కొంత మేర అవసరాలు తీరనున్నాయి.
ఇదీ చూడండి.