ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి, అన్నకు గాయాలు - ఏర్పేటు వద్ద రోడ్డు ప్రమాదం

కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా... అన్న గాయాల పాలైన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో వారి కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

road accident
road accident
author img

By

Published : May 27, 2021, 10:03 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా.. అన్నకు తీవ్ర గాయాలయ్యాయి.

రేణిగుంటలోని పాంచాలి నగర్​కు చెందిన రమణయ్య కుమారులు నవీన్ కుమార్(30), వేణుగోపాల్(32) ఏర్పేడు మండలంలోని మేర్లపాకలో బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏర్పేడు సీఐ శివ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్​ను ఆస్పత్రికి తరలించారు. నవీన్ కుమార్ మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: TTD-Hanuman birth place: అసంపూర్తిగా ముగిసిన హనుమాన్‌ జన్మస్థలంపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.