ETV Bharat / state

Accident: శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి, 9మందికి గాయాలు - చిత్తూరు జిల్లా వడమాలపేట రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

శ్రీవారి దర్శనానికి కాలినడకన వస్తున్న భక్తబృందంపై.. లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. శ్రీవారి దర్శనానికి తమిళనాడు వేలచ్చేరికి చెందిన భక్తుల బృందం బయల్దేరింది. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్.. భక్త బృందంపై లారీతో దూసుకొచ్చాడు. చిత్తూరు జిల్లా వడమాలపేటలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. 9 మంది గాయపడ్డారు.

one died and nine injured in road accident at vadamalapeta in chittor
శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్త బృందంపై దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి, 9మందికి గాయాలు
author img

By

Published : Jul 18, 2021, 5:19 PM IST

శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన వస్తున్న తమిళనాడు రాష్ట్రం వేలచ్చేరికి చెందిన భక్తుల బృందంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజారమ్మ కణం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వేలచ్చేరి నుంచి 15 మంది భక్తులు నడుచుకుంటూ వస్తుండగా.. లారీ భక్తులపైకి దూసుకొచ్చింది. లారీ డ్రైవర్​ నిద్రమత్తులో ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో త్యాగరాజన్ అనే ఓ భక్తుడు సంఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. గాయపడ్డ మరో తొమ్మిది మందిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించిన ఇద్దరు భక్తులను.. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారవ్వగా.. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.