మాస్కే కరోనాకు కవచం అనే నినాదంతో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తొలి ఆయుధమైన మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సరస్వతి, తంబళ్లపల్లె మండల వైద్యాధికారి నిరంజన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుంచి 31 వరకు గ్రామాల్లో ముమ్మరంగా 'మాస్ కె కరోనాకు కవచం, కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆరోగ్య విస్తరణాధికారి వెంకటరమణ పేర్కొన్నారు. నేడు తమ్మడపల్లిలో నిర్వహించిన ర్యాలీ, అవగాహన కార్యక్రమంలో వైద్య అధికారులతోపాటు ఎంపీడీవో దివాకర్ రెడ్డి, ఎమ్మార్వో భీమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు