తిరుపతిలో జాతీయ వైజ్ఞానిక సదస్సు - National Science day
చిత్తూరు జిల్లా తిరుపతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణాది అంతర్ కళాశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 'మహిళా రాణించడం ఎలా?' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వైజ్ఞానిక రంగంలో స్త్రీలు అనే నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి తిరుపతి ఐసర్ సిద్ధంగా ఉందని బయాలజీ ప్రొఫెసర్ బీజే రావు పేర్కొన్నారు.