రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం పోరాడుతుంటే.. తాము పండుగ చేసుకోవడం సమంజసం కాదనీ.. అందరూ బాగున్నప్పుడే జరుపుకుంటామని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కులదైవానికి పూజలు చేసేందుకు స్వగ్రామం వచ్చిన ఆమె.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇవీ చదవండి..