‘‘అప్పులు, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులకు దిల్లీలో పైరవీలు చేసే రాష్ట్ర మంత్రి ఒకరు ‘మీ వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పండి... తితిదే బోర్డు సభ్యులుగా నియమిస్తాం. మాకు అనుమతులు ఇప్పించి పెట్టండి’ అని క్విడ్‌ప్రోకో పద్ధతిలో పైరవీలు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయని’’ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తరచూ ఆయన కలిసే ఆ మంత్రిని అడిగి తితిదే బోర్డు సభ్యులుగా నియమించడానికి చాలా పేర్లు సేకరించినట్లు తెలిసిందన్నారు. మంగళవారం రఘురామ విలేకర్లతో మాట్లాడారు. ‘మీరు చెప్పిన వారికి తితిదే బోర్డులో సభ్యత్వం ఇస్తాం. మాకు రావాల్సిన అప్పులు ఇవ్వండి. జలవనరుల ప్రాజెక్టులకు అనుమతులివ్వండి. రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయండి... అని పైరవీలు చేస్తున్నారు. జంబో తితిదే బోర్డును ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత మందిని నియమించడం సమంజసమా...? అని ఆలోచించాలి’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి