చిత్తూరు జిల్లాలో ఓ ఘరానా దొంగను గంగవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బైరెడ్డిపల్లి నాలుగు రోడ్ల కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న శక్తివేల్ అనే వ్యక్తి తారసపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నంచగా.. విస్తుపోయే విషయం బయటపడింది.
బైరెడ్డిపల్లి, వి.కోట, కుప్పం పోలీసుస్టేషన్ పరిధిలోని 11 దొంగతనం కేసుల్లో ముద్దాయి ఇతనేనని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. శక్తివేల్ తమిళనాడు రాష్ట్రంలోని తిరపత్తుర్ జిల్లా వాసి అని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని.. కారు, ద్విచక్రవాహనం, 230 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: