చిత్తూరు జిల్లా పుత్తూరు షాదీఖానాలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సుకు నగిరి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగరి నియోజక ప్రజలు రెండు దఫాలు తనను ఎమ్మెల్యేగా ఆదరించారని బహుమతిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుత్తూరు షాదీఖానాకు రూ.కోటి85లక్షలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అలాగే పట్టణంలోని శివాలయం ఆలయాల నిర్మాణం, రాజగోపుర నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు.
ఇదీ చూడండి