శ్రీనివాసమంగాపురం వెంకటేశ్వరుడికి పట్టువస్త్రాల సమర్పణ - శ్రీనివాసమంగాపురం వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ వైభవంగా జరిగింది. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలతో పాదయాత్రగా శ్రీనివాస మంగాపురానికి చేరుకొన్నారు. పేరూరు, చెర్లోపల్లి, పెరుమాళ్లపల్లె, సి.మల్లవరం, కాలూరు మీదుగా పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు పట్టారు. పట్టువస్త్రాలను ఎమ్మెల్యే ఆలయ అధికారులకు అప్పగించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
శ్రీనివాసమంగాపురం వెంకటేశ్వరుడికి పట్టువస్త్రాల సమర్పణ