కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద మృతులకు... మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి నివాళులు అర్పించారు. పోస్టుమార్టం తర్వాత చిత్తూరు జిల్లాకు 14 మృతదేహాలు చేరుకోగా.. మదనపల్లెలో టెంపో డ్రైవర్ నజీర్ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం కింద చెక్కులను అందించారు. మృతుల ఖనన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి: