తిరుపతి నగర సమీపంలోని వకుళమాత ఆలయ నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. వందల సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునః నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ క్షేత్రం మహిమాన్వత క్షేత్రంగా భాసిల్లుతుందని మంత్రి అన్నారు.
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: కుక్కర్లో తల ఇరుక్కుపోయి.. తల్లడిల్లిన చిన్నారి