గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఆరోగ్యవరం, నిమ్మనపల్లిలో గుర్తించిన స్థలాలను పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరుకున్న పీహెచ్సీ కేంద్రం స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ కాలేజీ వచ్చేందుకు సీఎం జగన్ ఎంతో సహకారం అందించారన్నారు. ఆయనతోపాటు మంత్రి రామచంద్రారెడ్డి, అధికారులు స్థల పరిశీలనకు హాజరయ్యారు.
ఇవీ చదవండి: