ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 మంది కార్మికులు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట సమీపంలో సీసీఎల్ కంపెనీలో పనులు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక స్వగ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. వారంతా చంద్రగిరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం చేరుకుని... తమను సొంత ఊర్లకు పంపాలని నిరసన తెలిపారు. లాక్ డౌన్ కారణంగా కంపెనీ మూతపడిందని... పనులు లేక చేతిలో డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో స్వరాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని... అంతవరకు సంయమనం పాటించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: