చిత్తూరులోని ఒడిశాకు చెందిన 1200 మంది వలస కూలీలను జిల్లా అధికారులు వారి స్వగ్రామాలకు పంపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులను బస్సుల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలు నెగెటివ్ అని తేలిన కారణంగా.. వారిని శ్రామిక్ రైల్లో స్వస్థలాలకు పంపారు. కలెక్టర్ మార్కండేయులు, కొవిడ్ ప్రత్యేక అధికారి చంద్రమౌళి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఇవీ చదవండి: