చిత్తూరు జిల్లా మదనపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద... బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల వలస కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమను స్వరాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులను వేడుకున్నారు. 4 రోజులుగా తాము పస్తులుంటున్నామని వాపోయారు. ఈనెల ఒకటో తారీఖున స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నామని... ఇప్పటివరకూ తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి రాలేదని చెప్పారు. ఉపాధి కోసం మదనపల్లె వచ్చామని... వివిధ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా పనులు జరగట్లేదని.. దయచేసి తమను స్వగ్రామాలకు పంపాలని కోరారు.
ఇవీ చదవండి.. తిరుపతిలో వలస కార్మికుల ధర్నా