ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కుప్పం నియోజకవర్గ పరిధి మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బందికి శానిటైజర్లు, ఆక్సీ మీటర్లు, థర్మా మీటర్లను తెదేపా నేతలు అందజేశారు. అనంతరం సిబ్బందికి అభినందన పత్రాలు అందజేశారు. కరోనా కష్టకాలంలో వారు అందించిన నిస్వార్థ సేవలను నాయకులు కొనియాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కొవిడ్ నివారణ కోసం ట్రస్ట్ ద్వారా సాయం అందజేసినట్లు తెదేపా నేతలు తెలిపారు. నియోజక వర్గ పరిధిలోని పది పీహెచ్సీలకు మందులు అందజేశారు.
ఇదీ చదవండి:
Mansas Trust: 'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటింది'