తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పరిణయోత్సవాల్లో మొదటిరోజైన శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా... ఉభయనాంచారులు పల్లకీపై ఆలయంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణను అర్చకులు కోలాహలం జరిపారు. ఆ తరువాత శ్రీస్వామివారికి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏటా నారాయణగిరి ఉద్యానవనంలో ఈ వేడుకలను నిర్వహించేవారు. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు, 114 మరణాలు