చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్గా గంట్ల రజిని, వైస్ చైర్మన్గా ఆర్వీ. కృష్ణారెడ్డి, 13 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వారు ప్రజలకు వివరించారు. నియోజకవర్గం రైతులకు అండగా ఉంటామని అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులతోపాటు వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..