ETV Bharat / state

MURDER: చిన్ననాటి ప్రేమను మరువక.. భర్తను కడతేర్చిన భార్య - మధురవాడ నేర వార్తలు

విశాఖ మధురవాడ ఎన్జీవోస్ కాలనీలో జరిగిన హత్య కేసును(Murder in madhuravada NGO'S colony) పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసినట్లు డీసీపీ గౌతం శాలి(DCP goutham shali) వెల్లడించారు. మృతుడి భార్య రమ్య, ఆమె ప్రియుడు బాషా కలిసి సతీశ్‌ను చంపినట్లు తెలిపారు. స్కూల్ వాట్సాప్ గ్రూప్(school whats app group) ద్వారా కలుసుకున్న వీరిద్దరూ... తమ వివాహేతర(illegal contact) సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఈ ఘాతూకానికి ఒడిగట్టారని డీసీపీ స్పష్టం చేశారు.

భార్య చేతిలో భర్త దారుణ హత్య
భార్య చేతిలో భర్త దారుణ హత్య
author img

By

Published : Jul 18, 2021, 8:09 PM IST

వారిద్దరిదీ చిన్న నాటి ప్రేమ... పాఠశాల రోజుల్లోనే ప్రేమించుకుని విడిపోయారు. సుదీర్ఘ విరామం అనంతరం స్కూల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్లీ కలుసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మద్య మళ్లీ ప్రేమ చిగురించింది. అప్పటికే ఆమెకు పెళ్లై, పిల్లలూ ఉన్నారు. అయినప్పటికీ తన కుటుంబం కంటే ప్రియుడే ముఖ్యం అనుకున్న ఆమె.. తన ప్రియుడితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య భావించింది. ముందస్తు పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ అంశంపై కేసు నమోదు కాగా... పోలీసులనూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. చివరికి తన ప్రియుడితో కలిసి కటకటాలపాలైంది.

రాడ్డుతో తలపై కొట్టి...

విశాఖ మధురవాడలోని దుర్గానగర్​లో సతీశ్ అనే వ్యక్తి... తన భార్య రమ్య, పిల్లలతో కలిసి రాత్రి నడకకు వెళ్లాడు. రోడ్డుపై నడుస్తున్న సతీశ్​ను గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సతీశ్​ను.. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రమ్య.. పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు.

రమ్య తీరుపై అనుమానం...

తన భర్తపై దాడికి పాల్పడ్డ సమయంలో తాను అతనితోనే ఉన్నానని చెప్పడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి రమ్య ఆరు అడుగుల దూరంలోనే ఉన్నానని చెప్పడం, భర్త సతీశ్​పై దాడి జరుగుతున్న సమయంలో ఆమె ప్రతిఘటించకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ కేసులో రమ్యపై అనుమానంతో పోలీసులు విచారించగా... తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నట్లు విశాఖ డీసీపీ గౌతం శాలి వెల్లడించారు. సతీశ్ హత్యకు రెండు రోజుల ముందే రమ్య.. తన ప్రియుడు షేక్ బాషాతో కలిసి సీసీ కెమెరాలు లేని, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని హత్యకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు.

నిందితుల అరెస్టు...

హత్యకు పాల్పడిన నిందితులిద్దరి మధ్య చిన్నప్పుడే ప్రేమ వ్యవహారం ఉండేదని డీసీపీ గౌతం శాలి అన్నారు. సుదీర్ఘ సమయం అనంతరం.. పదో తరగతి స్నేహితుల వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న రమ్య భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారని, సతీశ్​ను హత్య చేసి రమ్య, బాషాలు ఒక్కటవ్వాలని ప్లాన్ వేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో రాత్రి నడకకు వెళుతున్న సతీశ్​ తలపై రాడ్డుతో కొట్టి హత్య చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారిని రిమాండ్​కు తరలించామని డీసీపీ గౌతమ్ శాలి వివరించారు.

ఇవీచదవండి.

TWINS MURDER: కవలల హత్యకేసు: కన్నతండ్రే కాలయముడు !

lorry accident: నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకొచ్చిన లారీ.. ఒకరు మృతి

CYBER ATTACK: బ్యాంక్​ సర్వర్​లోకి చొరబడి కోట్లు కొల్లగొట్టింది ఎందరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.