Man on cell tower: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం రాజీవ్ నగర్లో ఉంటున్న క్రాంతికి కొంత కాలం క్రితమే పెళ్లైంది. కొన్నాళ్లపాటు హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. రోజురోజుకి విభేదాలు పెరగడంతో.. ఇటీవలే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన ఇంటి సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు క్రాంతి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను వినకుండా దూకేస్తానంటూ బెదిరించాడు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న భార్య సంఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ.. అతడు కిందకు దిగలేదు. చాలా సేపు పోలీసులతో పాటు చాలామంది అతడిని కిందకు దింపే ప్రయత్నాలు చేశారు.
ఇదీ చూడండి:
Farmer died in clash: బకాయిల విడుదల కోరుతూ చేపట్టిన ధర్నాలో తోపులాట.. రైతు మృతి