చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా చేయాలంటూ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. వైకాపా ప్రభుత్వం.. గతంలో ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్ గుర్తు చేశారు. ఈ అంశాన్ని మిగిలిన కౌన్సిలర్లు బలపరిచి... ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం ద్వారా తెలియజేయాలని కోరారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ... వారివారి వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై చర్చించారు.
ఇదీ చదవండీ...