చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టణ శివారు ప్రాంతంలోని అమ్మ చెరువు మిట్ట వద్ద లారీ, ట్రాక్టర్ - ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఐదు మందికి గాయాలయ్యాయి. వారిని మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు చెదిరి పడిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మదనపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలను క్రమబద్దీకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి