ETV Bharat / state

శ్రీవారికి సమర్పించే ప్రసాదాలు మీకు తెలుసా? - శ్రీవారి ప్రసాదాల రకాలు

కరోనా వ్యాప్తి నివారణకు భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసినప్పటికీ.... ఆగమశాస్త్రం ప్రకారం అన్ని రకాల వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా.. శ్రీవారికి నిత్యం అనేక రకాల ప్రసాదాలు నివేదిస్తున్నారు. ఆలయం సంపంగి ప్రాకారంలోని వకుళామాత పోటులో శ్రీవైష్ణవులే తయారుచేసిన ప్రసాదాలను అన్ని వేళల్లో స్వామివారికి అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆలయాలన్నీ మూతపడిన సమయంలో తిరుమలేశుని సన్నిధిలో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయనే విషయంపై ప్రత్యేక కథనం.

types of prasadams in tirumala
శ్రీవారికి సమర్పించే ప్రసాదాలు
author img

By

Published : May 18, 2020, 1:09 PM IST

శ్రీవారికి నివేదించే ప్రసాదాలు

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా భక్తులకు శ్రీవారి దర్శనాలు రద్దు చేసినప్పటికీ... శ్రీవారికి జరగాల్సిన అన్ని రకాల వైదిక కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. సుప్రభాత సేవ మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తూ మితంగా తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా స్వామి వారికి సమర్పిస్తున్నారు.

భక్తులు లేని కారణంగా.. మోతాదు తగ్గించినప్పటికీ నిత్యం స్వామి వారికి నివేదించే ప్రసాదాల సమర్పణ మాత్రం యథావిధిగానే కొనసాగుతోంది. ఉదయం ఐదున్నర గంటలకు మొదటి ఘంట, పదిన్నర గంటలకు రెండవ ఘంట, మధ్యాహ్నం ఒంటి గంటకు కల్యాణోత్సవం, ఏడున్నర గంటలకు తోమాల సేవ సమయంతోపాటు రాత్రి ఏకాంత సేవలో నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

ఆగమశాస్త్రం ప్రకారమే...

శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ఉండే వకుళమాత పోటులో ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవైష్ణవులే కట్టెల పొయ్యిలపై అన్నప్రసాదాలు తయారు చేస్తారు. మొదటి ఘంటలో చక్కెర పొంగళి, కదంబం, పులిహోర, దధ్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూ, వడలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ ఘంట సమయంలో పెరుగన్నం, చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సిరా, సేకరాబాత్‌ నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి ఘంటకు కదంబం, మొలహోరా, తోమాలదోస, లడ్డూ, వడతో ప్రసాదాన్ని స్వామివారికి అందిస్తారు.

వారపు సేవలైన ఆర్జిత సేవల్లో మరికొన్ని ప్రసాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. సోమవారం విశేషపూజ సందర్భంగా పెద్ద దోసలు, పెద్ద అప్పాలు, పెద్ద వడలను నివేదిస్తారు. మంగళవారం మాత్రం ప్రసాదం, బుధవారం పాయసం, పెసర పప్పు ప్రసాదాలు సిద్ధం చేస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబి, మురుకు, పాయసాన్ని నైవేధ్యంగా పెడతారు.

శ్రీవారికి అభిషేకం జరిగే శుక్రవారం రోజున ప్రత్యేకంగా పోలీలు సమర్పిస్తారు. కల్యాణోత్సవంలో చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, కల్యాణోత్సవం లడ్డూ, వడలు సమర్పిస్తారు. ఏకాంత సేవలో వేడిపాలు, పండ్లు, జీడిపప్పు నివేదిస్తారు. సాధారణ రోజుల్లో 4 లక్షల లడ్డూలు, 4 నుంచి 5 వేల పెద్ద లడ్డూలు, 2 నుంచి 3 వేల వడలు, 120 నుంచి 150 గంగాళాల అన్నప్రసాదాలు, 50 నుంచి 60 గంపల ఇతర ప్రసాదాలను తయారు చేస్తారు.

అయితే.. అన్ని ప్రసాదాలకు సంబంధించి ఒక్కో గంగాళం, గంపను మాత్రమే శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. లాక్‌డౌన్‌ కారణంగా భక్తులెవ్వరు లేకపోవడంతో ప్రస్తుతం వంద చిన్న లడ్డూలు, వడలు, 50 కల్యాణోత్సవం లడ్డూలు, 20 గంగాళాల అన్నప్రసాదాలు, 10 గంపల ఇతర ప్రసాదాలను తయారు చేస్తున్నారు.

నైవేద్య సమర్పణ అనంతరం అన్న ప్రసాదాలను విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులు, తిరుమల స్థానికులు, పేద విద్యార్థులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. లడ్డూలు, వడలు మాత్రం తిరుపతిలో విక్రయిస్తున్నారు. తిరుమలకు భక్తుల అనుమతి లేని కారణంగా తిరుపతిలోని దేవస్థానం పరిపాలనా భవనం వద్ద రోజూ 500 కల్యాణోత్సవం లడ్డూలు, వడలు విక్రయిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఈ నెలాఖరు వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.